Pages

Monday, October 9, 2017

రూప సంకరం చేయకూడదు

శ్రీ గురుభ్యోనమః

నువ్వు నమ్మిన గురువునో, దేవుణ్ణో ఇతర దేవీ దేవతల రూపాలుగా మార్చి మార్ఫింగ్ చేస్తున్నావంటే , నీకు నీ గురువు "స్వ స్వరూపం " అంటే అసలైన భౌతిక రూపం మీద ప్రేమ, నమ్మకం లేదన్నమాటే. అది ఆయనను అవమానించడమే - పూజించడం కాదు. అది గణపతి కావచ్చు, సాయి కావచ్చు ఇతర ఏ బాబా ఐనా కావచ్చు.

నిరాకారుడైన పరమాత్మ మనకి ఒక రూపంలో గోచరించాడంటే ఆరూపం ఒక గొప్ప సందేశాన్ని చూపుతుంది, తాను ప్రకటించే రక్షణకి, విభూతికి అనుగుణంగా ఆయుధాలు, కూర్చునే, నించునే భంగిమ ఇవన్నీ ఆ అవతార హేతువునీ, ప్రత్యేకతనీ చూపుతాయి. దాన్ని ఇంకొరికి మార్ఫ్ చేసి చూడడం భావదారిద్ర్యమే. అలా ఆరూపం సగుణంగా రావడానికి వెనక తత్సంబంధ ఋషుల ద్రష్టత్వమూ, తపఃఫలమూ, తపించిన భక్తుల కోరికా ఉంటాయి, వాటిని ఒకరివేరొకరివిగా మార్చడం అంటే ఇవన్నింటినీ, ఋషులనూ అవమానించినట్లే. ముఖ్యంగా ఆ బాబాలను గురువులనూ అవమానించడమే ఔతుంది. ఎవరికి ఏరూపం ఉందో ఆరూపంతో కొలవడమే ఉత్తమ భక్తుని లక్షణం. రూప సంకరం చేయకూడదు.

-శంకరకింకర


No comments:

Post a Comment